Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: చిరంజీవి సినిమాకు డేట్ ఫిక్స్

Waltair Veerayya: సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. బాలయ్య వచ్చిన 24 గంటల గ్యాప్ లో చిరంజీవి వస్తున్నాడు.

Waltair Veerayya: చిరంజీవి సినిమాకు డేట్ ఫిక్స్
X

చిరంజీవి, బాబీ కాంబోలో క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తోంది 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

చిరంజీవి సంక్రాంతికి చాలా బ్లాక్‌బస్టర్‌ లు అందించారు. పండుగకు థియేటర్లలో మాస్ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోందంటోంది యూనిట్. విడుదల తేదీ పోస్టర్‌ లో చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్‌ లో లుంగీ, హెడ్‌ బ్యాండ్‌ తో కనిపించారు. చేతిలో బల్లెం లాంటి ఆయుధం పట్టుకొని వర్షంలో సముద్రంలో పడవ నడుపుతూ పవర్ ఫుల్ గా కనిపించారు చిరంజీవి.

ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌ గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌ లో ప్రారంభమయ్యాయి. బాస్ పార్టీ సాంగ్, డిసెంబర్ 31 రాత్రి హోరెత్తిపోవడం గ్యారెంటీ.

ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.




First Published:  7 Dec 2022 12:59 PM GMT
Next Story