Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: చిరు సినిమా షూటింగ్ అప్ డేట్స్

Chiranjeevi's Waltair Veerayya: వాల్తేరు వీరయ్య షూటింగ్ అయిపోలేదు. ఇంకా ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూట్ నడుస్తోంది.

Waltair Veerayya: చిరు సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

వాల్తేరు వీరయ్య సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని, సంక్రాంతి విడుదల కోసం శరవేగంగా ముస్తాబవుతోందని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు.

అవును.. వాల్తేరు వీరయ్య షూటింగ్ ఇంకా నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చిరు, రవితేజ మధ్య కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

ఇక్కడితో ఈ సినిమా షూటింగ్ అయిపోయిందనుకుంటే పొరపాటే. చిరంజీవి-శృతిహాసన్ మధ్య ఓ సాంగ్ పెండింగ్ ఉంది. ఆ పాటను విదేశాల్లో షూట్ చేస్తారు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

రాబోయే 10 రోజుల్లో ఈ పని మొత్తం పూర్తిచేయాలని యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే, ఓవైపు రిలీజ్ డేట్ తరుముకొస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పని పూర్తవ్వాలి, ఇంకోవైపు ప్రచారం స్టార్ట్ చేయాలి.

యూనిట్ మాత్రం మరో 2 రోజుల్లో రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్, ఆ తర్వాత 3-4 రోజుల్లో డ్యూయట్ పూర్తవుతుందని చెబుతోంది. అలా వారం రోజుల్లో పని పూర్తవుతుందని చెబుతున్నారు. ఒకవేళ విదేశాల్లో షూటింగ్ కు ఏమైనా ఆటంకాలు ఎదురైతే, అప్పటికప్పుడు సెట్ వేసి పని పూర్తిచేయాలని నిర్ణయించారు.

First Published:  2 Dec 2022 5:23 AM GMT
Next Story