Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi Waltair Veerayya: బాస్ పార్టీకి డేట్ ఫిక్స్

Chiranjeevi's Waltair Veerayya - బాస్ పార్టీకి రంగం సిద్ధమైంది. మాస్ సాంగ్ కి అంతా రెడీ అయ్యారు. పనిలోపనిగా సరికొత్త పోస్టర్ కూడా వచ్చేసింది.

Chiranjeevi Waltair Veerayya: బాస్ పార్టీకి డేట్ ఫిక్స్
X

బాస్ పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ కు ఓ డేట్ ఫిక్స్ చేశారు. టైమ్ కూడా లాక్ చేశారు. ఇదంతా చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య ముచ్చట.

2023 సంక్రాంతికి విడుదల కానున్న వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ నవంబర్ 23న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

ఈ ప్రకటన సందర్భంగా వాల్తేరు వీరయ్య నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చింది. పక్కా మాస్ గెటప్ లో లుంగీ కట్టి డాన్స్ చేస్తున్న చిరంజీవి స్టిల్ అది. ఈ స్టిల్ చూస్తుంటే, రాబోతున్న ఫస్ట్ సింగిల్ ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ అనిపిస్తోంది. ఈ సినిమాలో ఐటెంసాంగ్ లో ఊర్వశి రౌథేలా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దేవిశ్రీప్రసాద్ ఈ మాస్ సాంగ్ ను కంపోజ్ చేశాడు. బాబి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది వాల్తేరు వీరయ్య.




First Published:  20 Nov 2022 12:08 PM GMT
Next Story