Telugu Global
Cinema & Entertainment

Viswambhara | చిరు సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం

Chiranjeevi - చిరంజీవి కొత్త సినిమా స్టార్ట్ చేశారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది.

Viswambhara | చిరు సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం
X

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ అడ్వెంచర్ పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ అనుకుంటున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం రెగ్యులర్ షూట్‌ను తాజాగా ప్రారంభించారు.

రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్టుగా ఓ క్లాప్ బోర్డ్ ను చూపించారు. ఈ క్లాప్‌బోర్డ్‌ను దర్శకుడు మారుతి డిజైన్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో దట్టమైన అడవిని గమనించవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మొదటి షెడ్యూల్‌లోనే జాయిన్ అవుతారు.

అనౌన్స్‌మెంట్ పోస్టర్ సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఆ తర్వాత, రెండు వేర్వేరు సందర్భాలలో విడుదలైన మరో రెండు పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచాయి.

లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. చిరంజీవి కెరీర్ లోనే కాస్ట్ లీ సినిమా ఇది. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. చిరంజీవి అన్ని సినిమాలకు పనిచేసినట్టుగానే, విశ్వంభరకు కూడా సుశ్మిత కొణెదల కాస్ట్యూమ్ డిజైనర్.

First Published:  23 Nov 2023 5:14 PM GMT
Next Story