Telugu Global
Cinema & Entertainment

Viswambhara | విశ్వంభర విశేషాలు

Chiranjeevi's Viswambhara - చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలు మీకోసం..

Viswambhara | విశ్వంభర విశేషాలు
X

విశ్వంభర సినిమా అటు బిజినెస్ తో పాటు, ఇటు ప్రొడక్షన్ పరంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ లో చిరంజీవి జాయిన్ అయిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలు చూద్దాం..

విశ్వంభర సినిమాను మ్యాగ్జిమమ్ సెట్స్ లోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమాకు ఔట్ డోర్ షూటింగ్ పోర్షన్ చాలా తక్కువ. ఈ మూవీ కోసం ఏకంగా 13 సెట్స్ వేస్తున్నారు. ఈ సెట్స్ కోసమే అటుఇటుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే, ఈ నెల్లోనే ఆమె సెట్స్ లో జాయిన్ అవుతుంది. అప్పుడు ఘనంగా ప్రకటించడానికి అన్నీ సిద్ధం చేశారు. ఇదే పద్ధతిని మిగతా హీరోయిన్ల విషయంలో కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించారు.

ఈ సినిమాకు భారీగా గ్రాఫిక్ వర్క్ అవసరం. దీని కోసం హైదరాబాద్, ముంబయితో పాటు, విదేశాలకు చెందిన గ్రాఫిక్ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆల్రెడీ గ్రాఫిక్ వర్క్ మొదలైంది. ఈ వర్క్ ను ఫాలో అప్ చేసేందుకు దర్శకుడు వశిష్ఠ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు.

ఇక ఈ సినిమాకు తాజాగా శాటిలైట్ డీల్ క్లోజ్ చేశారు. చిరంజీవి సినిమాల్ని వరుసగా దక్కించుకుంటున్న జెమినీ ఛానెల్, విశ్వంభర శాటిలైట్ రైట్స్ ను కూడా దక్కించుకుంది.

ఇక విశ్వంభర మూవీలో చిరంజీవి సరికొత్త గెటప్స్ లో కనిపించబోతున్నారు. సినిమాలో ఆయన ఎన్ని గెటప్స్ లో కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి వస్తోంది విశ్వంభర.

First Published:  4 Feb 2024 4:56 PM GMT
Next Story