Telugu Global
Cinema & Entertainment

Vishwambhara | చిరంజీవి సినిమా షూటింగ్ అప్ డేట్స్

Vishwambhara - చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర షూటింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం..

Vishwambhara | చిరంజీవి సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ పాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బ్లాక్‌బస్టర్ 'బింబిసార'ను అందించిన తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి కొంత టాకీ పార్ట్‌, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించారు. తాజాగా మరో షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ పార్ట్ షూట్ ప్రారంభించారు.

ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ పార్ట్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు.

విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి10న విడుదల కానుంది విశ్వంభర.

First Published:  2 April 2024 4:52 PM GMT
Next Story