Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi: వాల్తేరువీరయ్య సక్సెస్ పై 'మెగా' రియాక్షన్

Chiranjeevi reaction to Waltair Veerayya Success - వాల్తేరు వీరయ్య సక్సెస్ తో చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. తన ఆనందాన్ని వరంగల్ లో జరిగిన సభలో అందరితో పంచుకున్నారు చిరు.

Chiranjeevi: వాల్తేరువీరయ్య సక్సెస్ పై మెగా రియాక్షన్
X

చిరంజీవి హీరోగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టయింది. చిరంజీవి స్టామినాను మరోసారి చాటింది. ఏకంగా 250 కోట్ల రూపాయల గ్రాస్ సాధించేదిశగా దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా సక్సెస్ సంబరాలు నిర్వహించారు. వరంగల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వీరయ్య విజయ విహారం అనే పేరుపెట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి, ఫుల్ జోష్ తో కనిపించారు. సినిమా సక్సెస్ అయినందుకు అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు.

"వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం కానీ నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అవుతుందని మేము ఊహించలేదు. నాన్ ఎస్ ఎస్ ఆర్ సినిమాల రికార్డ్స్ కి వచ్చిందంటే.. ఇంత గొప్ప విజయానికి అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది ప్రేక్షకులకే. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య 250 కోట్ల గ్రాస్ కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెరపై చూస్తూ ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది."

తాజాగా పుట్టినరోజు జరుపుకుంది శృతిహాసన్. వరంగల్ వేదికగా శృతిహాసన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, కార్యక్రమానికి వచ్చిన తన అభిమానులతో కూడా శుభాకాంక్షలు చెప్పించారు. లక్షలాది మంది అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.

First Published:  29 Jan 2023 1:41 PM GMT
Next Story