Telugu Global
Cinema & Entertainment

కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు - చిరంజీవి

మంచి కంటెంట్ వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెబుతున్నారు చిరంజీవి. బింబిసార, సీతారామం సినిమాల్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

chiranjeevi
X

ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతున్న పరిస్థితిపై చిరంజీవి స్పందించారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆటోమేటిగ్గా థియేటర్లకు వస్తారని, తాజాగా విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని అన్నారు.

"ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ తాజాగా విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా `సీతారామం`, `బింబిసార` చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు"

ఇలా సీతారామం, బింబిసార సినిమాలపై ప్రశంసలు కురిపించారు చిరు. ఆగస్ట్ 5 న విడుదలైన రెండు సినిమాలు `బింబిసార', `సీతారామం' హిట్ టాక్‌ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్‌ కమర్షియల్‌ అంశాలతో మాస్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్‌ లవ్‌ స్టోరీతో క్లాస్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొడుతుంది.

ఇకపై ఇండస్ట్రీలో మేకర్స్ అంతా కంటెంట్ పై దృష్టి పెట్టాలని చిరంజీవి పరోక్షంగా సూచించారు. ఆసక్తికరమైన కథ, కథనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు.

చిరంజీవి ప్రకటనపై సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి ట్రోలింగ్ మొదలైంది. ఆచార్య సినిమాలో అలాంటి కంటెంట్ ఉండేలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదంటూ చిరంజీవిపై కొంతమంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

First Published:  7 Aug 2022 2:48 AM GMT
Next Story