Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ టీజర్ ఎలా ఉందంటే..!

చిరంజీవి పుట్టినరోజు కానుకగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. పనిలోపనిగా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

గాడ్ ఫాదర్ టీజర్ ఎలా ఉందంటే..!
X

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక రోజు ముందుగానే పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' టీజర్ ని తెలుగు, హిందీలో విడుదల చేశారు నిర్మాతలు. టీజర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార , సత్య దేవ్‌తో సహా ఇతర ప్రముఖ పాత్రలను పవర్ ఫుల్ గా పరిచయం చేశారు.

''ఇరవై ఏళ్ళు ఎక్కడి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సడన్ గా తిరిగొచ్చిన ఆరేళ్ళలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు'' అనే డైలాగ్ తో పవర్ ఫుల్ గా మొదలైంది గాడ్ ఫాదర్ టీజర్. ఇలాంటి కొన్ని డైలాగ్స్ తర్వాత, గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది. తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ కు కుడి భుజంగా భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇవ్వడం మరింత క్యురియాసిటీని పెంచింది.

టీజర్‌లోని ప్రతి సీక్వెన్స్ అద్భుతమైన ఎలివేషన్‌తో మెగా థ్రిల్ పంచాయి. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్‌గా అదరగొట్టారు. మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆకట్టుకుంది. స్టైలిష్‌గా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ బ్లాక్‌లు బాగున్నాయి.

టీజర్ చివర్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి జీపులో రావడం మెయిన్ హైలైట్. ముందుగా చెప్పినట్లుగా ఇది చిరంజీవి అభిమానులకు, సినీ అభిమానులకు అడ్వాన్స్ మెగా బర్త్ డే ప్రజంటేషన్. సల్మాన్ ఖాన్ ప్రజన్స్ ఒక బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఫాక్టర్ అని చెప్పాలి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. గాడ్ ఫాదర్ 2022 దసరా కానుకగా అక్టోబర్ న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



First Published:  22 Aug 2022 2:17 AM GMT
Next Story