Telugu Global
Cinema & Entertainment

వంద కోట్ల క్లబ్ లో చేరిన గాడ్ ఫాదర్

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ మరో అరుదైన రికార్డ్ అందుకుంది.

వంద కోట్ల క్లబ్ లో చేరిన గాడ్ ఫాదర్
X

చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళీ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్టయింది. విడుదలైన మొదటి రోజే, మొదటి ఆటకు హిట్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్ సినిమా, నిన్నటితో 4 రోజుల రన్ పూర్తి చేసుకుంది.

విడుదలైన ఈ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది గాడ్ ఫాదర్ మూవీ. చిరంజీవి సినిమాకు హిట్ టాక్ వస్తే, కలెక్షన్లు ఎలా ఉంటాయో ఈ సినిమా మరోసారి రుచిచూపిస్తోంది.

నిజానికి గాడ్ ఫాదర్ సినిమాకు ఇంతకంటే ఎక్కువగానే వసూళ్లు రావాలి. 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ అందుకోవాల్సిన సినిమా ఇది. కాకపోతే ఆచార్య ఎఫెక్ట్ తో తక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. మరోవైపు ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాల కారణంగా స్క్రీన్ కౌంట్ తగ్గింది.

ఈ కారణాల వల్ల గాడ్ ఫాదర్ సినిమాకు వంద కోట్ల మార్క్ అందుకోవడానికి 4 రోజులు పట్టింది. లేదంటే, సల్మాన్ ఖాన్ సైతం ఉన్న ఈ సినిమా కేవలం 3 రోజుల్లో ఈ ఘనతను అందుకొని ఉండేది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.

First Published:  9 Oct 2022 8:25 AM GMT
Next Story