Telugu Global
Cinema & Entertainment

Gang Leader: చిరంజీవి సినిమా వాయిదా

Chiranjeevi's GangLeader - మరో 2 రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన గ్యాంగ్ లీడర్ సినిమా వాయిదా పడింది. కొత్త తేదీ ఇంకా రాలేదు.

Gang Leader: చిరంజీవి సినిమా వాయిదా
X

చిరంజీవి నటించిన కల్ట్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఆ సినిమా సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గ్యాంగ్ లీడర్ తో చిరంజీవి ఫ్యాన్ బేస్ డబుల్ అయింది. అలాంటి సినిమాను రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అంతలోనే నిరాశ తప్పలేదు.

లెక్కప్రకారం మరో 2 రోజుల్లో, అంటే ఈనెల 11వ తేదీన థియేటర్లలోకి రావాలి గ్యాంగ్ లీడర్ సినిమా. ఈ మేరకు ఆంధ్రాలోని కొన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. ఫ్యాన్స్ భారీగా టికెట్లు కూడా కొనుగోలు చేశారు.

అయితే సినిమా ప్రింట్ ఇంకా రెడీ కాలేదు. గ్యాంగ్ లీడర్ సినిమాను ఇప్పటికి టెక్నాలజీకి తగ్గట్టు 4కేలో మార్చే ప్రక్రియ, డాల్బీ స్టీరియోలికి సౌండ్ ను మార్చే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దీంతో సినిమా రీ-రిలీజ్ ను వాయిదా వేశారు.

ఈ సినిమా మళ్లీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం, మార్చి నెలలో గ్యాండ్ లీడర్ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

First Published:  9 Feb 2023 4:01 AM GMT
Next Story