Telugu Global
Cinema & Entertainment

ఈసారి కార్నివాల్ తరహాలో చిరంజీవి బర్త్ డే

మరో 2 రోజుల్లో తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చిరంజీవి. ఈసారి మెగాస్టార్ పుట్టినరోజును వినూత్నంగా నిర్వహించబోతున్నారు ఫ్యాన్స్. ఏకంగా కార్నివాల్ ఏర్పాటుచేస్తున్నారు.

chiranjeevi
X

చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పండగ రోజు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చిరంజీవి పుట్టినరోజున అతడి ఫ్యాన్స్ ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఆరోజు ఫ్యాన్స్ అంతా రక్తదాన శిబిరాల్లో పాల్గొంటారు. ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు వీటికితోడు ఈ ఏడాది చిరంజీవి బర్త్ డే వేడుకలు ఇంకాస్త విభిన్నంగా జరగనున్నాయి.

ప్రతి సంవత్సరం చిరంజీవి బర్త్ డే శిల్పకళా వేదికలో చేసేవాళ్ళు. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బర్త్ డే వేడుకల్లో అభిమానులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఈ మేరకు అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్ అనే కాన్సెప్ట్ తయారుచేశారు. దీని కోసం హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇండియా లో ఏ సినిమా హీరోకి ఇలాంటి కార్నివాల్ లాంటిది పెట్టలేదు. ఈ కార్నివాల్ అనేది ఫ్యాన్స్ కి ఒక గుర్తుగా ఉండబోతోంది. చాలా ఊళ్లలో చిరంజీవి బర్త్ డే ని పండుగలాగా చేసుకుంటారు. ఈసారి కార్నివాల్ లో అన్ని ప్రాంతాల అభిమానులు ఒకేచోట కలుస్తారు. దీని కోసం కార్నివాల్ లో సకల సదుపాయాలు ఏర్పాటుచేస్తున్నారు.

ఈ కార్నివాల్ లో నాగబాబుతో పాటు, మెగా కాంపౌండ్ కు చెందిన కొంతమంది హీరోలు పాల్గొంటారు. ఫ్యాన్స్ తో వాళ్లు మాట్లాడతారు. ఫొటోలు దిగుతారు. చిరంజీవికి సంబంధించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని విశేషాల్ని కూడా పంచుకుంటారు. చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22.

First Published:  20 Aug 2022 3:38 AM GMT
Next Story