Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar | చిరు ట్రయిలర్ బాగుంది కానీ..!

Chiranjeevi's Bholaa Shankar Trailer - భోళాశంకర్ ట్రయిలర్ రిలీజైంది. స్వయంగా రామ్ చరణ్, ఈ ట్రయిలర్ ను విడుదల చేశాడు.

Bholaa Shankar | చిరు ట్రయిలర్ బాగుంది కానీ..!
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం భోళాశంకర్. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళాశంకర్ పై మెగా ఫ్యాన్స్ కు అంచనాలు ఉండొచ్చు కానీ, వేదాళం సినిమా చూసినవాళ్లకు మాత్రం ఈ ట్రయిలర్ కొత్తగా అనిపించదు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. కథ, జానర్ చెబుతూనే, చిరంజీవిని ఎలివేట్ చేసేలా ట్రయిలర్ కట్ చేశారు. "నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దునియా ఉంది" అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. చిరంజీవి క్యారెక్టరైజేషన్ తో పాటు.. తమన్న, కీర్తిసురేష్ పాత్రల్ని కూడా పరిచయం చేశారు.

పిల్లల కిడ్నాప్ తో ట్రయిలర్ ప్రారంభమౌతుంది. పోలీసులకు కూడా సాయం చేసే పాత్రలో భోళా ఎంట్రీ గ్రాండ్ గా ఉంది. విజువల్స్ అన్నీ రిచ్ గా ఉన్నాయి. వాటికి మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ట్రయిలర్ లో పాటలు, చిరంజీవి స్టెప్పులు, చిరు ఫైట్స్ కూడా చూపించారు.

ఇలా కంప్లీట్ మాస్ మసాలా ప్యాకేజీతో భోళాశంకర్ రెడీ అయింది. ఆమధ్య రిలీజైన గ్లింప్స్ లో రష్మిని చూపించిన మేకర్స్, తాజా ట్రయిలర్ లో శ్రీముఖికి చోటిచ్చారు. ఇక ట్రయిలర్ చివర్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేయడం కొసమెరుపు.

అయితే టీజర్ పై వచ్చినట్టుగానే, ట్రయిలర్ లో కూడా చిరంజీవి తెలంగాణ యాస పై విమర్శలు వచ్చేలా ఉన్నాయి. పూర్తిగా మాస్ మసాలా ఎలిమెంట్స్ పై ఆధారపడి తెరకెక్కిన భోళాశంకర్ సినిమా, ఆగస్ట్ 11న థియేటర్లలోకి వస్తోంది. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు.

First Published:  27 July 2023 5:06 PM GMT
Next Story