Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar - భోళాశంకర్ బ్రాండ్ న్యూ పోస్టర్

Chiranjeevi's Bholaa Shankar Movie poster: భోళా శంకర్ సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ అయింది.

Bholaa Shankar - భోళాశంకర్ బ్రాండ్ న్యూ పోస్టర్
X

చిరంజీవి, మెహర్ రమేష్ ల మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.


మోషన్ పోస్టర్ లో చిరంజీవి ఫెరోషియస్ గా కనిపించారు. చేతిలో ఢమరుకం పట్టుకుని నటరాజ నాట్యం చేస్తున్నట్లు కనిపించారు. ఈ పోస్టర్ మహా శివరాత్రి సందర్భానికి తగినట్లు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.


క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు.


భోళాశంకర్ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.



First Published:  19 Feb 2023 4:00 PM GMT
Next Story