Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar - మరో 2 రోజుల్లో చిరంజీవి సినిమా టీజర్

Chiranjeevi's Bholaa Shankar - చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ భోళాశంకర్. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించి టీజర్ రెడీ అయింది.

chiranjeevi bholaa shankar
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. తమన్నా హీరోయిన్. మెహర్ రమేష్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ పై ప్రకటన ఇచ్చారు మేకర్స్. మరో రెండు రోజుల్లో, అంటే ఈనెల 24న భోళాశంకర్ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందట మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఎట్రాక్ట్ చేసింది.

తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా రూపొందుతున్న భోళా శంకర్ లో మెగాస్టార్ సోదరిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఆమె ప్రియుడిగా సుశాంత్ కనిపించనున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు భోళాశంకర్ తో ఆ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలనుకుంటున్నారు. అటు మెహర్ రమేష్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. దాదాపు దర్శకత్వానికి దూరమైన ఈ డైరక్టర్, భోళాశంకర్ సక్సెస్ తో మళ్లీ డైరక్టర్ గా క్లిక్ అవ్వాలనుకుంటున్నాడు.

First Published:  22 Jun 2023 12:36 PM GMT
Next Story