Telugu Global
Cinema & Entertainment

రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరంజీవి ఆడియో

చిరంజీవి తాజాగా ఒక ఆడియోను ట్వీట్ చేశారు. ''నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు '' అంటూ 10 సెకన్ల ఆడియోను ట్వీట్ చేశారు.

రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరంజీవి ఆడియో
X

పార్టీ పెట్టి 18 సీట్లు సాధించి, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తాజాగా ఒక ఆడియోను ట్వీట్ చేశారు. ''నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు '' అంటూ 10 సెకన్ల ఆడియోను ట్వీట్ చేశారు.



ఇది చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలోని డైలాగ్‌గా చెబుతున్నారు. ఆడియో ఉద్దేశం ఏంటి అన్నది చెప్పకుండా కేవలం ఆ డైలాగ్‌ను ట్వీట్ చేశారు చిరంజీవి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ డైలాగ్‌ను వదిలినట్టు చెబుతున్నారు.

మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు గాడ్‌ ఫాదర్ రీమేక్. లూసిఫర్ భారీ హిట్ సాధించింది. తెలుగులోనూ చాలా మంది మోహన్‌లాల్‌ లూసిఫర్‌కు ఫిదా అయ్యారు. ఇప్పుడు అదే సినిమాను చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాకు హైప్‌ తీసుకురావడం కోసమే చిరంజీవి ఇలా పొలిటికల్ డైలాగ్‌ను ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. వాస్తవితలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. ఇటీవల బీజేపీ పెద్దలు ఆహ్వానించినా రాజకీయం తనకు సరిపడదని సున్నితంగానే చిరంజీవి తిరస్కరించారు కూడా. కాబట్టి లేటెస్ట్ డైలాగ్‌ ఆధారంగా పెద్దగా ఊహించుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి.

First Published:  20 Sep 2022 8:52 AM GMT
Next Story