Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi - షార్ట్ బ్రేక్ తీసుకున్న మెగాస్టార్

Chiranjeevi USA - చిరంజీవి షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. భార్యతో కలిసి అమెరికా వెళ్లారు.

Chiranjeevi - షార్ట్ బ్రేక్ తీసుకున్న మెగాస్టార్
X

మెగాస్టార్ చిరంజీవి షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. కేవలం రీఫ్రెష్ అయ్యేందుకు, కొన్ని రోజులు సేదతీరేందుకు మాత్రమే చిరంజీవి అమెరికా వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.

రీసెంట్ గా భోళాశంకర్ డబ్బింగ్ వర్క్ పూర్తిచేశారు చిరంజీవి. ఆ పనితో భోళాశంకర్ కు సంబంధించి చిరంజీవి పనులేవీ మిగల్లేదు. దీంతో ఈ గ్యాప్ లో రిలాక్స్ అయ్యేందుకు అమెరికాను ఎన్నుకున్నారు చిరు. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి ప్రాజెక్టు వివరాలు కూడా బయటపెట్టారు.

అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే, తన కుమార్తె సుశ్మిత నిర్మాణ సారధ్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేస్తానని ప్రకటించారు చిరంజీవి. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించనుంది. మరో కీలక పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ, అతడికి హీరోయిన్ గా శ్రీలీల కనిపించబోతున్నారు.

తన యూఎస్ పర్యటనకు సంబంధించి చిరంజీవి కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఎమిరేట్స్ విమానంలోని బిజినెస్ క్లాస్ లో భార్యతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

First Published:  7 July 2023 5:05 PM GMT
Next Story