Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: చిరంజీవి సెంటిమెంట్ ఇది

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి చిరంజీవి ఓ సెంటిమెంట్ బయటపెట్టారు. ఆ సెంటిమెంట్ ప్రకారం, సినిమా సూపర్ హిట్ అంటున్నారు.

Waltair Veerayya: చిరంజీవి సెంటిమెంట్ ఇది
X

ప్రతి హీరోకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. చిరంజీవికి కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. ఏదైనా కథను చిరంజీవి ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే చేస్తే, అది సూపర్ హిట్ అవుతుందట.

"దర్శకుడు బాబి నాకు టైటిల్ చెప్పాడు. ఆ తర్వాత కథ చెప్పాడు. గంటన్నర చెప్పాడు. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాను. ఇలా ఫస్ట్ సిట్టింగ్ లోనే చాలా బాగుందని ఓకే చెప్పిన నా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. నా హిట్ సినిమాలన్నింటినీ నేను ఇలానే ఓకే చేశాను. బాగుంది, తర్వాత చూద్దాం, ఇంకా డెవలప్ చేయండి అనే సినిమాలన్నీ సోసోగానే ఆడాయి. సో.. ఆ నమ్మకంతో చెబుతున్నాను, వాల్తేరు వీరయ్య చాలా బాగా ఆడుతుంది."

వాల్తేరు వీరయ్య కథను కూడా ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే చేశారట చిరు. అందుకే ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని అంటున్నారు.

ఈ మూవీకి సంబంధించి వైజాగ్ లో భారీ ఫంక్షన్ చేశారు. దీనికి మెగా మాస్ పార్టీ అనే పేరు పెట్టారు. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి, వాల్తేరు వీరయ్యపై అంచనాల్ని మరింత పెంచేశారు. సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని అన్నారు.

వాల్తేరు వీరయ్యలో మరో హీరోగా నటించిన రవితేజ కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు. ఈ కార్యక్రమానికి శృతిహాసన్ మాత్రం మిస్సయింది. జ్వరం రావడంతో ఆమె ముంబయిలోనే ఉండిపోయింది.

First Published:  9 Jan 2023 3:36 AM GMT
Next Story