Telugu Global
Cinema & Entertainment

Nijam with Smita - Chiranjeevi: పూల వర్షమే కాదు.. నాపై కోడిగుడ్లు కూడా విసిరారు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Nijam with Smita - Chiranjeevi: సోనీ లివ్ ఓటీటీ వేదికగా పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా 'నిజం విత్ స్మిత' అనే షో ఈనెల 10వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ షో ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి సోనీ లివ్ తాజాగా ఒక ప్రోమో విడుదల చేసింది.

Nijam with Smita - Chiranjeevi: పూల వర్షమే కాదు.. నాపై కోడిగుడ్లు కూడా విసిరారు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
X

Nijam with Smita - Chiranjeevi: పూల వర్షమే కాదు.. నాపై కోడిగుడ్లు కూడా విసిరారు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడు దశాబ్దలకుపైగా నెంబర్ వన్ స్టేటస్‌లో నిలిచిన హీరో మెగా స్టార్ చిరంజీవి. అందరివాడిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి తన సినిమాలతో వినోదం పంచడమే కాదు.. సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటారు. 2008 వరకు ఆయన ఇమేజ్ ఆకాశమంత ఎత్తులో ఉండేది. అయితే ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి నెగిటివిటీ ఎదుర్కొన్నారు.

అయితే ఆ గడ్డుకాలం కొద్ది రోజులే. చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయిన తర్వాత ప్రేక్షకులు ఆయన్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. అయితే మెగాస్టార్‌గా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న చిరంజీవి ప్రశంసలే కాదు .. విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఆ విషయాలను స్వయంగా చిరంజీవే వెల్లడించారు.

సోనీ లివ్ ఓటీటీ వేదికగా పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా 'నిజం విత్ స్మిత' అనే షో ఈనెల 10వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ షో ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి సోనీ లివ్ తాజాగా ఒక ప్రోమో విడుదల చేసింది. ఆ ప్రోమోలో చిరంజీవి స్మితతో మాట్లాడుతూ తన జీవితంలో ప్రశంసలే కాదు.. విమర్శలు సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు.

గతంలో ఒకసారి జగిత్యాలకు వెళ్ళగా అభిమానులు పూల వర్షం కురిపించారని.. అయితే అదే సమయంలో మరి కొంతమంది తనపై కోడిగుడ్లు విసిరినట్లు చిరంజీవి తెలిపారు. అయితే ఈ విషయం గురించి చిరంజీవి గతంలో ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు. ఇన్నేళ్ల తర్వాత నిజాలు మాత్రమే మాట్లాడాలని నిబంధనలు పెట్టిన నిజం విత్ స్మిత షోలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చిరంజీవి చెప్పారు.



అంతేకాదు తన దశాబ్దాల కెరీర్లో హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎదురైన అవమానాలు, అనుమానాల గురించి చిరంజీవి వివరించారు. తన వ్యక్తిగత విషయాల గురించి, సినీ ఇండస్ట్రీ గురించి పలు విషయాలను ఈ షోలో ఆయన వెల్లడించారు. నిజం విత్ స్మిత ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా.. అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



First Published:  8 Feb 2023 9:19 AM GMT
Next Story