Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి దర్శకత్వంలో నటించను

రాజమౌళి దర్శకత్వంలో తను నటించనని ప్రకటించారు చిరంజీవి. మెగాస్టార్ లాంటి వ్యక్తి ఎందుకిలా ప్రకటన చేయాల్సి వచ్చింది?

రాజమౌళి దర్శకత్వంలో నటించను
X

టాలీవుడ్ లోనే కాదు, టోటల్ ఇండియాలోనే టాప్ డైరక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు రాజమౌళి. ఇతడితో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా రెడీ. కానీ మెగాస్టార్ మాత్రం కాదు. అవును.. రాజమౌళితో సినిమా చేయనంటున్నారు చిరంజీవి. దీనికి ఆయన కారణాన్ని కూడా వెల్లడించారు.

"రాజమౌళి గొప్ప దర్శకుడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‌పుట్‌ను ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. సినిమా తెరకెక్కించటానికి తను ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే. ఒక్కో సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారు. నేను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, పాన్‌ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని లేదు."

ఇలా అసలు కారణాన్ని బయటపెట్టారు చిరంజీవి. దసరా కానుకగా అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్న చిరంజీవి, ఆ సినిమా ప్రచారంలో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజమౌళితో సినిమాపై సూటిగా, సుత్తిలేకుండా స్పందించారు.

First Published:  1 Oct 2022 6:55 AM GMT
Next Story