Telugu Global
Cinema & Entertainment

మెగా డాన్స్ నంబర్ మొదలైంది

గాడ్ ఫాదర్ లో చిరంజీవి, సల్మాన్ కలిసి ఓ సాంగ్ చేస్తున్నారు. ఆ సాంగ్ షూటింగ్ తాజాగా మొదలైంది.

మెగా డాన్స్ నంబర్ మొదలైంది
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రీమేక్ సినిమా 'గాడ్ ఫాదర్'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమౌతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ముంబై లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో, చిరంజీవి-సల్మాన్ పై డాన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డాన్స్ నంబర్‌ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

Advertisement

ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిరంజీవి. "గాడ్‌ఫాదర్‌ కోసం భాయ్‌ సల్మాన్‌ తో కలిసి డ్యాన్స్‌ చేశా. ప్రభుదేవా కొరియోగ్రఫీ వండర్ ఫుల్. ఈ పాట అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగ" అని ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు.

Next Story