Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi | 'ఫ్యామిలీ మేన్'లో చిరంజీవి.. జస్ట్ మిస్

Chiranjeevi - ఓటీటీలో సూపర్ హిట్టయింది ఫ్యామిలీ మేన్. మరి ఈ సిరీస్ ను సినిమాగా మార్చి చిరంజీవితో చేస్తే ఎలా ఉంటుంది.. డీటెయిల్స్ మీకోసం..

Chiranjeevi | ఫ్యామిలీ మేన్లో చిరంజీవి.. జస్ట్ మిస్
X

అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్టయిన ఇండియన్ సిరీస్ లో ఫ్యామిలీ మేన్ ఒకటి. మనోజ్ బాజ్ పాయ్ నటించిన ఆ సిరీస్ కు రాజ్-డీకే ద్వయం దర్శకత్వం వహించారు. ఆ సిరీస్ ఇండియా అంతటా సూపర్ హిట్టవ్వడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంది. నిజానికి ఈ సబ్జెక్ట్ చిరంజీవి దగ్గరకు వచ్చిందంట.

ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. ఫ్యామిలీమేన్ సబ్జెక్ట్ ను సిరీస్ గా కాకుండా, ఓ సినిమాలా చిరంజీవితో చేయాలనేది అశ్వనీదత్ ప్లాన్. ఈ మేరకు రాజ్-డీకేతో చిరంజీవి దగ్గర సిట్టింగ్ కూడా ఏర్పాటుచేయించారు అశ్వనీదత్. కానీ చిరంజీవి ఈ కథకు ఓకే చెప్పలేదంట.

అప్పటికే ఖైదీనంబర్ 150తో సూపర్ హిట్ కొట్టారు చిరంజీవి. ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్న చిరు.. ఫ్యామిలీ మేన్ సబ్డెక్ట్ కు కనెక్ట్ అవ్వలేకపోయారు. మరీ ముఖ్యంగా ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించడానికి ఇష్టపడలేదు. అప్పటికీ అశ్వనీదత్ కథలో, పాత్రలో మార్పులు చేద్దామన్నారు. పిల్లలు లేకుండా సినిమా చేద్దామన్నారు.

కానీ మరికొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ మేన్ ను చిరంజీవి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అదే సిరీస్ రూపంలో వచ్చి పెద్ద హిట్టయింది. ఆ ప్రాజెక్టు చేయలేకపోయినందుకు చాలా బాధ వ్యక్తం చేశారు అశ్వనీదత్.

First Published:  30 Aug 2023 5:40 PM GMT
Next Story