Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya | చరిత్ర తిరగరాసినట్టుందన్న చిరు

Chiranjeevi Waltair Veerayya - ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది వాల్తేరు వీరయ్య. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా 200 రోజులు పూర్తి చేసుకుంది.

Waltair Veerayya | చరిత్ర తిరగరాసినట్టుందన్న చిరు
X

మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య'. మాస్ రాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం ఇది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్లలో విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి.

సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత 200 రోజుల పండగ చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు చిరు.

''ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు.. సిల్వర్ జూబ్లీలు ఆడేవి. ఇప్పుడు.. 2 వారాల్లో అటు ఇటు తేలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉంది. 200 రోజులు సినిమా ఆడి, విజయానికి గుర్తుగా షీల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. అందరూ కలసికట్టుగా పని చేస్తే మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనడానికి ఇది నిదర్శనం. చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది. నా తమ్ముడు రవితేజ ఒప్పుకోవడం ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళడానికి కారణం."

ఈ సందర్భంగా తన మూవీస్ లైనప్ బయటపెట్టారు చిరు. భోళాశంకర్ రిలీజ్ తర్వాత కూతురు సుశ్మిత నిర్మాతగా ఓ సినిమా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు.

First Published:  8 Aug 2023 3:38 PM GMT
Next Story