Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya Movie: రచ్చ రంబోళా.. చిరంజీవి-రవితేజ డాన్స్ నంబర్

Waltair Veerayya Movie: మొన్నటికిమొన్న చిరంజీవి-సల్మాన్ కలిసి డాన్స్ చేశారు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు చిరు-రవితేజ కలిసి ఓ మాస్ నంబర్ కు డాన్స్ చేశారు.

Waltair Veerayya Movie: రచ్చ రంబోళా.. చిరంజీవి-రవితేజ డాన్స్ నంబర్
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఇద్దరు స్టార్స్‌ ని ఒకే తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్.. చిరంజీవి, రవితేజ గ్రేస్ ఫుల్ మూవ్స్, ఎనర్జీతో అలరించేలా మాస్ డ్యాన్స్ నంబర్‌ ను ట్యూన్ చేశాడు. శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. చిరంజీవి, రవితేజ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. భారీ సెట్‌ లో తీసిన ఈ సాంగ్ టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నారు.

చిరంజీవి వింటేజ్ అవతార్‌ లో కనిపించిన ఈ సినిమా టైటిల్ టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మేనరిజమ్స్ అన్నీ మాస్ గా ఉన్నాయి.

అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

First Published:  29 Oct 2022 6:19 AM GMT
Next Story