Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సమర్పణలో అమీర్ ఖాన్ సినిమా

అమీర్ ఖాన్ తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన చిరంజీవి, సినిమాను సమర్పిస్తున్నారు.

చిరంజీవి సమర్పణలో అమీర్ ఖాన్ సినిమా
X

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం.

ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిరంజీవి విడుదల చేశారు. ఇందులో బాలరాజు పాత్రలో నటిస్తున్నారు చైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు అక్కినేని హీరో. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సన్నివేశాలు, సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చూశారు. షో అయిపోయిన తర్వాత అమీర్ ఖాన్ నటన గురించి.. చైతన్య పాత్ర గురించి బాగా ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని.. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందని అన్నారు.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత అమీర్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, బాలీవుడ్ లో ఈ మూవీపై బజ్ బాగా నడుస్తోంది.





First Published:  21 July 2022 12:30 PM GMT
Next Story