Telugu Global
Cinema & Entertainment

13న వస్తున్నా.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ చెప్పిన చిరంజీవి..!

బాలకృష్ణ సినిమాను ముందుగా విడుదల చేస్తున్నట్లు మూడు రోజుల కిందట నిర్ణయించిన నిర్మాతలు.. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

13న వస్తున్నా.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ చెప్పిన చిరంజీవి..!
X

ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా అగ్ర హీరోలు అందరూ మేం వస్తున్నాం.. మేం వస్తున్నాం.. అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ముందే ప్రకటించిన వారిలో చరణ్, పవన్ కల్యాణ్, అఖిల్ సినిమాలు తప్పుకోగా.. ఆదిపురుష్ లో గ్రాఫిక్ వర్క్ సరిగా లేదని విమర్శలు రావడంతో ప్రభాస్ సినిమా కూడా సైడ్ అయ్యింది. ఇక మిగిలింది విజయ్ నటిస్తున్న వారసుడు, బాలయ్య వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య. ఈ మూడు సినిమాలే మిగిలినప్పటికీ సంక్రాంతికి ఏ డేట్ లో ఏ మూవీ వచ్చేది మాత్రం నిర్మాతలు ప్రకటించలేదు.

ఈ మూడు సినిమాల్లో ముందుగా దిల్ రాజు తాను నిర్మిస్తున్న వారసుడు మూవీని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను ఒకే సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వీరు చాలా రోజులు సంక్రాంతికి విడుదల సంక్రాంతికి విడుదల.. అని చెప్పారే తప్ప ఏ డేట్ లో వచ్చేది మాత్రం చెప్పలేదు.

ఏ సినిమాను ముందు తీసుకురావాలో చాలా రోజులపాటు మేకర్స్ నిర్ణయించుకోలేకపోయారు. ఎట్టకేలకు బాలకృష్ణ సినిమాను ముందుగా విడుదల చేస్తున్నట్లు మూడు రోజుల కిందట నిర్ణయించిన నిర్మాతలు జనవరి 12వ తేదీన ఆ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

ఈ సందర్భంగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో చిరంజీవి సముద్రంలో పడవపై చేతిలో బ‌ల్లెం.. తలకు రుమాలు కట్టి మాస్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతికి విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

First Published:  7 Dec 2022 1:51 PM GMT
Next Story