Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi - పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరంజీవి?

Chiranjeevi Puri Jagannadh - గతంలో కలిసి సినిమా చేయాలని ట్రై చేశారు చిరు-పూరి. కానీ కుదరలేదు. ఇప్పుడు మరోసారి కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Chiranjeevi - పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరంజీవి?
X

ఒక సినిమా పూర్తిచేయడం ఆలస్యం, 2 సినిమాలు ప్రకటిస్తున్నారు చిరంజీవి. ఇలా సినిమాలే లోకంగా బతికేస్తున్న చిరు, ఇప్పుడు మరికొన్ని కొత్త సినిమాలపై వర్కవుట్ స్టార్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో చిరు జోరు పెంచారు.

త్వరలోనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఈ మేరకు పూరి జగన్నాధ్ సరికొత్త కథను చిరంజీవి కోసం రాసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ కథ ఓకే అయితే కనుక, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా వస్తుంది.

గతంలో చిరు-పూరి కాంబోలో సినిమా రావాల్సింది. దానికి ఆటో జానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు పూరి. కానీ ఆ కథ సెకెండాఫ్ చిరంజీవికి నచ్చలేదు. అలా ఆ ప్రాజెక్ట్ సైడ్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి నుంచి పూరి జగన్నాధ్ కు పిలుపొచ్చింది.

ఓవైపు లైగర్ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ, పూరి జగన్నాధ్ పై చాలా నమ్మకంగా ఉన్నారు చిరంజీవి. అందుకే ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ వస్తుంది.

First Published:  12 March 2023 2:50 PM GMT
Next Story