Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar - చిరంజీవి యాసపై సెటైర్లు

Bholaa Shankar - భోళాశంకర్ సినిమా టీజర్ వచ్చింది. అందులో చిరంజీవి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ పై విమర్శలు వస్తున్నాయి.

Bholaa Shankar - చిరంజీవి యాసపై సెటైర్లు
X

భోళాశంకర్ టీజర్ వచ్చింది. కళ్లముందే మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతా బాగానే ఉంది కానీ, టీజర్ లో ఓ అంశంపై మాత్రం చాలామంది పెదవి విరుస్తున్నారు. అదే చిరంజీవి తెలంగాణ యాస.

టీజర్ లో తెలంగాణ యాస ట్రై చేశారు చిరంజీవి. కానీ అదేమంత క్లిక్ అవ్వలేదనేది చాలామంది మాట. టీజర్ మొత్తం బాగున్నప్పటికీ, చిరంజీవికి ఆ యాస పెట్టడం ఎబ్బెట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు.

ఇంత వయసులో కూడా చిరంజీవిలో ఎనర్జీ తగ్గలేదు. అతడి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. చిరంజీవి నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలన్నీ భోళాశంకర్ లో ఉన్నాయనే విషయాన్ని టీజర్ లో స్పష్టంగా చూపించారు. ఇలా అన్నింటిలో బెస్ట్ అనిపించుకున్న భోళాశంకర్, ఒక్క తెలంగాణ యాస విషయంలో మాత్రం రిమార్కులు చూస్తున్నారు.

మరీ ముఖ్యంగా మనకు హద్దుల్లేవ్..సరిహద్దుల్లేవు.. ఆల్ ఏరియాస్ మనవే అంటూ తెలంగాణ స్లాంగ్ లో చిరంజీవి చెప్పిన డైలాగ్ పెద్దగా క్లిక్ అవ్వలేదంటున్నారు. ఏదేమైనా తన చరిష్మాతో, ఇలాంటి నెగెటివ్ రిమార్క్స్ అన్నింటినీ దాటేశారు చిరు. అయితే టీజర్ కే ఇన్ని విమర్శలొచ్చాయంటే, ట్రయిలర్ నాటికి అవి కచ్చితంగా పెరుగుతాయనే భయం మాత్రం మెగాభిమానుల్లో ఉంది.

మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న థియేటర్లలోకి వస్తోంది. సినిమాలో చిరు సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది.

First Published:  25 Jun 2023 1:00 PM GMT
Next Story