Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi | మనవరాలితో తొలి వినాయక చవితి

Chiranjeevi - పుట్టిన తర్వాత తొలిసారి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది రామ్ చరణ్ కూతురు క్లీంకార. తాత చిరంజీవితో కలిసి వినాయక చవితి వేడుకలో పాల్గొంది.

Chiranjeevi | మనవరాలితో తొలి వినాయక చవితి
X

రామ్ చ‌ర‌ణ్ అయ్య‌ప్ప‌ మాల వేసుకుని క‌నిపిస్తున్నారు. మ‌రోవైపు ఉపాసన సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో ఉంది. వీరి జీవితాల్లోకి క్లీంకార వచ్చింది. 3 నెల‌ల‌ుగా అమ్మ‌మ్మ ఇంట్లో ఉన్న ఈ చిన్నారి, ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టింది.

ఈ ఏడాది చిరు ఫ్యామిలీ గ‌ణేష్ చతుర్థి వేడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా చిరంజీవి సంతోషానికి పగ్గాల్లేవ్. మనవరాలితో తొలి వినాయక చవితి వేడుకను జరుపుకున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన ఫొటోస్ ను కూడా ఆయన షేర్ చేశారు.

క్లీంకారతో జ‌రుపుకున్న ఈ గ‌ణేష్ వేడుక‌లు.. వాటికి సంబంధించిన ఫొటోలు అంద‌రి మ‌న‌సుల‌ను హత్తుకుంటున్నాయి. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ ఫొటోలు మెగాభిమానులందరిలో పండుగ ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

పూజ కంటే ముందు, త‌మ ఇంట్లోకి తొలిసారి అడుగు పెట్టిన చిన్నారికి రామ్‌చ‌ర‌ణ్‌, గ్రాండ్ పేరెంట్స్ చిరంజీవి, సురేఖ అద్భుతంగా స్వాగతం ప‌లికారు. ఓ వైపు గ‌ణేష్ చతుర్థి, మ‌రో వైపు క్లీంకార ఇంట్లోకి అడుగు పెట్ట‌టం అనేది కుటుంబ స‌భ్యుల‌కు ఎంతో ఆనందాన్నిచ్చింది. వారెంత ఆనందంగా ఉన్నార‌నే విష‌యం ఫొటోల్లో స్ప‌ష్టంగా తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించారు. సాధార‌ణంగా ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో చ‌ర‌ణ్ అయ్య‌ప్ప మాల వేసుకుని క‌నిపిస్తుంటారు. RRR రిలీజ్ ముందు ఆస్కార్ నామినేష‌న్స్ ముందుగానూ ఆయ‌న అయ్య‌ప్ప‌మాల‌ను ధ‌రించి క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న మాల‌తో క‌నిపించారు. ఈ ఏడాది తండ్రిగా మారిన ఆయ‌న‌కు ఇదెంతో ప్ర‌త్యేకమైన‌ద‌నే చెప్పాలి.






First Published:  18 Sep 2023 4:32 PM GMT
Next Story