Telugu Global
Cinema & Entertainment

మెగా ప్రకటన వచ్చేసింది

బాబి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ ఏంటనేది దీపావళి రోజున తేలిపోతుంది. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ టైమ్ సెట్ చేశారు.

మెగా ప్రకటన వచ్చేసింది
X

చిరంజీవి, బాబీ కాంబోలో సినిమా వస్తోంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. పక్కా మాస్ లుక్స్ లో చిరంజీవిని చూపించబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు, జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన దేవిశ్రీ ప్రసాద్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ కూడా బాబీనే రాసుకున్నాడు, డైలాగ్స్ కూడా అతడివే. కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి కలిసి స్క్రీన్‌ప్లే అందించారు.

First Published:  21 Oct 2022 3:46 AM GMT
Next Story