Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi-Balakrishna | అప్పుడు చిరు.. ఇప్పుడు బాలయ్య.. ఇదేం ఆనందం

Chiranjeevi-Balakrishna - ఇద్దరు హీరోలు, ఇద్దరూ సీనియర్లే, కానీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలతో గతంలో ఒకరు, ప్రస్తుతం మరొకరు వివాదాస్పదమయ్యారు.

Chiranjeevi-Balakrishna | అప్పుడు చిరు.. ఇప్పుడు బాలయ్య.. ఇదేం ఆనందం
X

రానురాను సీనియర్లు చిన్న పిల్లలు అయిపోతున్నాను. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. మొన్నటికిమొన్న కీర్తిసురేష్ పై చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో పాటు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది. శ్రీలీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదానికి దారితీశాయి. ఇంతకీ బాలకృష్ణ ఏమన్నారో చూద్దాం..

భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ ఈమధ్య జరిగింది. ఈ సినిమాలో బాలయ్య-శ్రీలీల తండ్రికూతుళ్లుగా నటించారు. అయితే ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం బాలయ్య, తన మనసులో మాట బయటపెట్టారు. సినిమాలో చిచ్చా..చిచ్చా అంటూ శ్రీలీల తనను ఆటపట్టించిందని, ఈసారి మాత్రం తన సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఇస్తానని అన్నారు.

అక్కడితో ఆగలేదు. ఇదే విషయాన్ని తన కొడుకు మోక్షజ్ఞకు చెబితే, చాలా సీరియస్ అయ్యాడట. "రేపోమాపో తను హీరోగా మారతానని, అప్పుడు శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటానని, అంతలోనే, నువ్వు శ్రీలీలను లాగేసుకుంటే ఎలా అంటూ" బాలయ్యపై గుస్సా అయ్యాడంట. దీంతో బాలకృష్ణ వ్యవహారశైలిపై విమర్శలు చెలరేగుతున్నాయి.

మొన్నటికిమొన్న భోళాశంకర్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఇలాంటిదే జరిగింది. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి-కీర్తిసురేష్ అన్నాచెల్లెళ్లుగా నటించారు. అయితే ఫంక్షన్ లో మాత్రం చిరంజీవి ఆగలేదు. సినిమాలో తను కీర్తిసురేష్ కు అన్నయ్యనే అయినప్పటికీ.. తన సరసన హీరోయిన్ గా ఆమె నటిస్తే చూడాలని ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. తనకు నిజజీవితంలో చాలామంది తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారని.. అఁదరూ తనను అన్నయ్య అని పిలుస్తుంటారని, కీర్తిసురేష్ మాత్రం బయట తనను అన్నయ్య అని పిలవకూడదని కండిషన్ పెట్టారు చిరు. అప్పట్లో ఈ కామెంట్స్ కూడా దుమారం రేపాయి.

మొత్తమ్మీద అప్పుడు చిరంజీవి, ఇప్పుడు బాలకృష్ణ.. తమ వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు. పెద్ద వయసు, సీనియారిటీ ఉన్నప్పటికీ... అభిమానుల్ని అలరించడం కోసం ఇలా సీనియర్లు అప్పుడప్పుడు గీత దాటుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి.

First Published:  10 Oct 2023 2:55 AM GMT
Next Story