Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: వింటేజ్ చిరంజీవిని చూస్తారు

Waltair Veerayya - వాల్తేరు వీరయ్య సినిమాలో పాత చిరంజీవిని చూస్తారని చెబుతున్నారు మెగాస్టార్. ఒకప్పటి ముఠామేస్త్రి, ఘరానా మొగుడు సినిమాలు గుర్తుకొస్తాయంటున్నారు.

Waltair Veerayya: వింటేజ్ చిరంజీవిని చూస్తారు
X

ఈమధ్య కాలంలో తన స్థాయి సక్సెస్ అందుకోలేదు చిరంజీవి. మరీ ముఖ్యంగా వింటేజ్ చిరంజీవిని అంతా మిస్సయ్యారు. ఒకప్పటి మాస్, యాక్షన్ చిరులో తగ్గింది. ఈ లోటును భర్తీ చేస్తూ వస్తోంది వాల్తేరు వీరయ్య. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో తన పాత లుక్, యాక్షన్ ను చూస్తారని ధీమాగా చెబుతున్నారు చిరంజీవి.

"కమ్ బ్యాక్ లో ఫ్రీడమ్ ఫైటర్ సైరాగా చేశాను. పాటలు, హీరోయిన్ లేకుండా పవర్ ఫుల్ పాత్రగా గాడ్ ఫాదర్ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో వాల్తేరు వీరయ్య చేశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాల్తేరు వీరయ్య చూస్తే, ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలన్నీ గుర్తొస్తాయి."

వాల్తేరు వీరయ్య సినిమాలో బలమైన కథ ఉందంటున్నారు చిరంజీవి. అలా కథ డిమాండ్ చేసింది కాబట్టే వీరయ్య పాత్రలో మాస్ గా తను కనిపించానని చెప్పుకొచ్చారు. అన్ని సినిమాలకు ఇలా మాస్ గా కనిపించడం కుదరదన్నారు.

రవితేజ కూడా వాల్తేరు వీరయ్యలో కీలక పాత్ర పోషించాడు. బాబి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

First Published:  12 Jan 2023 7:01 AM GMT
Next Story