Telugu Global
Cinema & Entertainment

Virupaksha - సాయితేజ్ సినిమాపై మెగా ప్రశంసలు

Chiranjeevi Virupaksha - సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో, చిరంజీవి ప్రత్యేకంగా సాయితేజ్ ను అభినందించారు.

Virupaksha - సాయితేజ్ సినిమాపై మెగా ప్రశంసలు
X

సాయిధరమ్‌తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదట్నుంచీ ఈ సినిమాపై ఓ రకమైన పాజిటివ్ బజ్‌ ఉంది. రిలీజైన మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది

మిస్ట్రీక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు హీరోలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయంపై చిరంజీవి స్పందించారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌కు, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

"విరూపాక్ష చిత్రంకు వస్తున్న అద్బుతమైన స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. సాయిధరమ్‌తేజ్ మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ విజయంతో ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీగా ఉంది. విరూపాక్ష చిత్రానికి ఆడియన్స్ ప్రశంసలు, అభినందనలు అందించడం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, టోటల్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు" అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్తమీనన్ నటించింది. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సక్సెస్‌ఫుల్ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

First Published:  22 April 2023 2:53 AM GMT
Next Story