Telugu Global
Cinema & Entertainment

Balagam Movie - బలగం సినిమాపై చిరు ప్రశంసలు

Chiranjeevi Balagam Movie - బలగం సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చిరంజీవి.

Balagam Movie - బలగం సినిమాపై చిరు ప్రశంసలు
X

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది బలగం సినిమా. కమెడిన్ వేణు, దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో 15 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద హిట్ కింద లెక్క.

తాజాగా ఈ సినిమాను మెచ్చుకున్న సెలబ్రిటీల లిస్ట్ లోకి చిరంజీవి కూడా చేరారు. బలగం సినిమాలో నిజాయితీ కనిపించిందన్నారు చిరంజీవి. అందరూ బాగా చేశారని మెచ్చుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..

‘‘సినిమాను వేణు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. బలగం నిజ‌మైన మూవీ. సినిమాలో నిజాయతీ ఉంది. దిల్ రాజు వంటి క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్ ఉన్న‌ప్పటికీ వేణు సినిమాకు న్యాయం చేశాడు. ప‌క్కా నేటివిటీ ఉన్న సినిమా. తెలంగాణ సంస్కృతిని వేణు చ‌క్క‌గా చూపించాడు. త‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూసిన ప్ర‌తీ విష‌యాన్ని ఇందులో చూపించాడు వేణు. గ‌తంలో వేణు ఉగ్గు క‌థ‌లు, బుర్ర క‌థ‌లుపై ఓ జ‌బ‌ర్ద‌స్త్ షో చేసిన‌ప్పుడు నేను చూశాను. నిజంగా వేణులో ఇంత టాలెంట్ ఉందా అని వేణుపై గౌర‌వం పెరిగింది. బలగం సినిమాతో త‌ను గొప్ప సినిమాను తీశాడనిపించింది’’

ఇలా బలగం సినిమాను, దర్శకుడు వేణును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చిరంజీవి. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కూతురు హన్షిత నిర్మించింది. నిర్మాతగా ఆమెకిదే తొలి సినిమా.

First Published:  12 March 2023 2:45 PM GMT
Next Story