Telugu Global
Cinema & Entertainment

Chiru Pawan Kalyan | వరుసగా 2 మెగా బ్రదర్స్ సినిమాలు

Chiranjeevi Pawan Kalyan - ఈ దసరాకి వారం రోజుల గ్యాప్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి.

Chiru Pawan Kalyan | వరుసగా 2 మెగా బ్రదర్స్ సినిమాలు
X

మరో వారం రోజుల్లో దసరా సీజన్ మొదలుకాబోతోంది. ఓవైపు థియేటర్లలో కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడీ పోటీ బుల్లితెరకు కూడా వచ్చేసింది. ఈ దసరాకు 2 సినిమాలు స్మాల్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. పైగా ఈ రెండు మెగా హీరోల సినిమాలే కావడం విశేషం.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమాను 15వ తేదీన జీ తెలుగులో ప్రసారం చేయబోతున్నారు. దసరాకు దాదాపు వారం రోజుల ముందే ఈ సినిమాను ప్రసారం చేయడం ద్వారా, పోటీని జీ తెలుగు కాస్త ముందుగానే ప్రారంభించినట్టయింది. ఈ సినిమా కోసం జీ తెలుగు భారీగా ప్రచారం కోసం నిర్వహిస్తోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ అవరణలో 50 అడుగుల భారీ పవన్ కల్యాణ్ కటౌట్ ను కూడా ఏర్పాటు చేస్తోంది.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కింది బ్రో సినిమా. వినోదాయ శితం అనే తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన బ్రో మూవీకి త్రివిక్రమ్ తనదైన మార్పుచేర్పులు చేశాడు. డైలాగ్స్ కూడా అందించాడు. సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో అతడి సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ సినిమా టీవీల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

ఇక సిసలైన దసరా సందడి చిరంజీవితో మొదలుకాబోతోంది. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను 24వ తేదీన జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా ఇది. పైగా రవితేజ-చిరంజీవి కలిసి నటించిన సినిమా కూడా. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బుల్లితెరపై కూడా హిట్టవుతుందని అంతా ఆశిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది వాల్తేరు వీరయ్య సినిమా. ఈ మూవీలో చిరంజీవి సరసన శృతిహాసన్, రవితేజ సరసన క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇలా దసరాకు మెగా అన్నదమ్ముల సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాల రేటింగ్స్ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది.

First Published:  9 Oct 2023 1:58 AM GMT
Next Story