Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi | రీమేక్ చేస్తే తప్పేంటి?

Chiranjeevi remakes - రీమేక్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు చిరంజీవి. భోళాశంకర్ రీమేక్ పై స్పందించారు.

Chiranjeevi | రీమేక్ చేస్తే తప్పేంటి?
X

ఓ మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నానని, అందుకే రీమేక్ అయినప్పటికీ, భోళాశంకర్ కథకు ఓకే చెప్పానని అన్నారు చిరంజీవి. కథ బాగున్నప్పుడు రీమేక్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

"ఓ మంచి కథ దొరికినప్పుడు, దాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పేంటి? వేదాళం మంచి కథ. అందుకే రీమేక్ చేశాను. పైగా వేదాళం సినిమా ఏ ఓటీటీలోనూ లేదు. తెలుగు ప్రేక్షకులెవ్వరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చా. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది."

చాలా ఏళ్ల కిందటే వేదాళం సినిమా చూశానని, ఆ కథ తనకు బాగా నచ్చిందన్నారు చిరంజీవి. అందుకే రీమేక్ అనే ఆలోచన లేకుండా ఓకే చేశానన్నారు. పైగా దర్శకుడు మెహర్ రమేశ్, ఈ కథకు చేసిన మార్పుచేర్పులు కూడా తనకు బాగా నచ్చాయన్నారు చిరు. భోళాశంకర్ ప్రీ-రిలీజ్ వేడుకలో ఈ విషయాల్ని వెల్లడించారు.

11వ తేదీన థియేటర్లలోకి వస్తోంది భోళాశంకర్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

First Published:  7 Aug 2023 4:34 AM GMT
Next Story