Telugu Global
Cinema & Entertainment

Naveen Polishetty | అనుష్కతో కెమిస్ట్రీనే ముఖ్యం అంటున్న నవీన్ పొలిశెట్టి

Anushka Naveen Polishetty - తన కొత్త సినిమాలో అనుష్కతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందంటున్నాడు నవీన్ పొలిశెట్టి. మొదటి 2 రోజులు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

Naveen Polishetty | అనుష్కతో కెమిస్ట్రీనే ముఖ్యం అంటున్న నవీన్ పొలిశెట్టి
X

ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరోయిన్ తో కెమిస్ట్రీ బాగుండాలని అంటున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. మరీ ముఖ్యంగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలు క్లిక్ అవ్వాలంటే, ఆ కెమిస్ట్రీ ఇంకా బాగుండాలని చెబుతున్నాడు. ఈ విషయంలో అనుష్క రూపంలో తమకు మంచి హీరోయిన్ దొరికిందని చెబుతున్నాడు.

"అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్ బాగుంది. మా మధ్య టైమింగ్ కుదిరేందుకు ఒకట్రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం. ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే. సినిమాలో అనుష్క చేసే రచ్చను చూస్తారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అయ్యే సినిమా ఇది."

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో స్టాండప్ కమెడియన్ గా నటించాడు నవీన్. పైగా ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు. అందుకే మరో సినిమాకు అంగీకరించకుండా, ఇదే సినిమాపై ఫోకస్ పెట్టాడంట.

"స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. నిజంగానే స్టాండప్ కామెడీ షోస్ కండెక్ట్ చేసి రియల్ ఆడియెన్స్ తో మా సినిమాలో సీన్స్ షూట్ చేశాం. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ మూవీ మీదే దృష్టి పెట్టా. రొమాంటిక్ కామెడీ మూవీస్ తో పోల్చితే మా సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పనిచేశాం. సినిమాను అంతగా నమ్మాం. ఒక కథను మీ ముందుకు తీసుకువద్దామని నమ్మకంతో పనిచేశాం."

సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకుడు.

First Published:  22 Aug 2023 2:39 AM GMT
Next Story