Telugu Global
Cinema & Entertainment

Chandramukhi 2 - చంద్రముఖి 2 నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్

Chandramukhi 2 - లారెన్స్, కంగనా రనౌత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా చంద్రముఖి-2. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Chandramukhi 2 - చంద్రముఖి 2 నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్
X

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుభాస్క‌ర‌న్ నిర్మాత‌.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘స్వాగ‌తాంజ‌లి...’ అనే సాహిత్యంతో ఉన్న ఈ సాంగ్ వినడానికే కాదు, చూడ్డానికి కూడా బాగుంది. వీడియో చూస్తుంటే, సాంగ్ చాలా గ్రాండ్ గా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఇందులో కంగనా రనౌత్, భారీగా అభరణాలు ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు.

ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యంలో పాట విన‌సొంపుగా ఉంది. శ్రీనిధి తిరుమ‌ల పాడిన ఈ పాట‌ను చైత‌న్య ప్రసాద్ రాశారు.

2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమా వస్తోంది. కాకపోతే రజనీకాంత్ పాత్రలో లారెన్స్ కనిపిస్తున్నాడు.

‘చంద్రముఖి 2’ను వినాయ‌క చ‌వితికి ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

First Published:  12 Aug 2023 3:19 AM GMT
Next Story