Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar | చిరంజీవి నుంచి సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది

Bholaa Shankar - భోళాశంకర్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ఈసారి సెలబ్రేషన్ సాంగ్ ను విడుదల చేశారు.

Bholaa Shankar | చిరంజీవి నుంచి సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది
X

మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ నుంచి ఒక పాట చిత్రీకరణ జరుగుతుండా ఒక వీడియోను లీక్ చేశారు మెగాస్టార్. ఆ పాట మేకింగ్‌లోని భారీతనం చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఇప్పుడా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. జామ్ జామ్ జజ్జనక అనే ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

ఇది భోళా శంకర్ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్. మహతి స్వర సాగర్ పార్టీ, సెలబ్రేషన్ ఫీల్ వచ్చేలా పాటని కంపోజ్ చేశాడు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలాపించారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించాడు. మధ్యలో పాపులర్ ఫోక్ నెంబర్ నర్సపల్లెని మిక్స్ చేయడం బాగుంది.

చిరంజీవి డాన్స్ మూమెంట్స్ ఎప్పట్లానే బాగున్నాయి. పాటలో లైవ్లీగా కనిపించారు మెగాస్టార్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ మెరిశారు.

అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది భోళాశంకర్.

First Published:  12 July 2023 3:15 AM GMT
Next Story