Telugu Global
Cinema & Entertainment

Vaarasudu Movie: "వారసుడు" హైదరాబాద్ ప్రమోషన్స్ కి విజయ్ ని దిల్ రాజు తీసుకురాగలడా?

Vaarasudu Movie: కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తాజాగా ఇప్పుడు "వారసుడు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

Vaarasudu Movie: వారసుడు హైదరాబాద్ ప్రమోషన్స్ కి విజయ్ ని దిల్ రాజు తీసుకురాగలడా?
X

Vaarasudu Movie: "వారసుడు" హైదరాబాద్ ప్రమోషన్స్ కి విజయ్ ని దిల్ రాజు తీసుకురాగలడా?

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తాజాగా ఇప్పుడు "వారసుడు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. "వారీసు" అనే టైటిల్ తో తమిళ్లో కూడా విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కి సిద్ధమవుతోంది.

భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ "వీరసింహారెడ్డి" మరియు చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలతో క్లాష్ అవ్వబోతోంది. దిల్ రాజు ఈ సినిమా ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈ మధ్యలో చెన్నైలో జరగగా విజయ్ కూడా తన స్పీచ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.

దిల్ రాజు కూడా ఈవెంట్ లో బాగానే మాట్లాడారు. అయితే తాజాగా ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న ఎదురవుతోంది. మొత్తానికి చిత్ర బృందాన్ని హైదరాబాద్ కూడా తీసుకువచ్చి తెలుగులో కూడా సినిమా ప్రమోషన్స్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంత సినిమా విడుదలవుతున్నప్పటికీ హీరో హీరోయిన్ తప్ప సినిమాలో నటించిన ప్రమోషన్లకి అంతగా రారు.

చాలా సందర్భాల్లో విజయ్ కూడా ఇలాంటి ఈవెంట్లను అవాయిడ్ చేస్తారు. మరి తన కెరియర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాగా విడుదల కాబోతున్న "వారసుడు" సినిమా కోసం విజయ్ వస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా హైదరాబాద్లో అయితే కచ్చితంగా సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఉంటుంది కానీ దానికి విజయ్ వస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  26 Dec 2022 12:25 PM GMT
Next Story