Telugu Global
Cinema & Entertainment

Butta Bomma: చిన్న సినిమాకు పెద్ద రిలీజ్ డేట్ దొరికింది

Butta Bomma: సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిన్న సినిమా ఇది. ఇప్పుడీ మూవీకి మంచి విడుదల తేదీ ఫిక్స్ అయింది.

Butta Bomma: చిన్న సినిమాకు పెద్ద రిలీజ్ డేట్ దొరికింది
X

'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం "బుట్ట బొమ్మ". అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈలోగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. బుట్టబొమ్మ సినిమాను జనవరి 26న విడుదల చేయబోతున్నారు. ఓ చిన్న సినిమాకు హాలిడే వీకెండ్ దొరకడం పెద్ద విషయం. విడుదల తేదీని ప్రకటిస్తూ, మరో ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు.

'బుట్ట బొమ్మ'గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయంటున్నారు మేకర్స్. 'ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయట.

వీటితో పాటు వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. 'వరుడు కావలెను' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నాడు.




First Published:  17 Dec 2022 12:29 PM GMT
Next Story