Telugu Global
Cinema & Entertainment

Butta Bomma: ఆఖరి నిమిషంలో వాయిదా, కొత్త తేదీ ఇదే

Butta Bomma Movie new release date - రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ కావాల్సిన బుట్టబొమ్మ సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయింది.

Butta Bomma: ఆఖరి నిమిషంలో వాయిదా, కొత్త తేదీ ఇదే
X

కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా 'బుట్టబొమ్మ' సినిమా ఉంటుందని చిత్ర నిర్మాత నాగవంశీ నమ్మకంగా చెబుతున్నాడు. ఆ సినిమానే బుట్టబొమ్మ. జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్ కూడా విడుదల చేసింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నాడు.

ఇప్పటికే నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నాడు. హీరోయిన్ అనిఖా సురేంద్రన్ సైతం ఈ సినిమా కలర్ ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి గతేడాది 'డీజే టిల్లు' చిత్రాన్ని నిర్మించింది. 2022 ఫిబ్రవరిలో విడుదలైన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వస్తున్న 'బుట్టబొమ్మ' కూడా ఆ విజయాన్ని పునరావృతం చేస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

First Published:  21 Jan 2023 1:17 PM GMT
Next Story