Telugu Global
Cinema & Entertainment

బుజ్జీ.. ఇలారా ట్రయిలర్ రివ్యూ

ధనరాజ్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ డ్రామా బుజ్జి ఇలారా. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఈ క్రైమ్ డ్రామాకు కథ సమకూర్చడం విశేషం.

బుజ్జీ.. ఇలారా ట్రయిలర్ రివ్యూ
X

సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బుజ్జి ఇలా రా'. 'సైకలాజికల్‌ థ్రిల్లర్‌' అనేది ట్యాగ్‌లైన్‌. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ బ్యానర్లపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ మెటిరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో అల్లరి నరేష్ ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అల్లరినరేష్ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం..

నిమిషం 52 సెకెన్ల నిడివి ఉన్న ఈ ట్రయిలర్ చూస్తే ఇదొక హారర్-థ్రిల్లర్ అనే విషయం తెలుస్తూనే ఉంది. చిన్న పిల్లల హత్యల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందనే విషయాన్ని ట్రయిలర్ లోనే చెప్పేశారు. ధన్ రాజ్ ను పోలీసాఫీసర్ గా, సునీల్ ను ముస్లిం యువకుడిగా చూపించారు.

హీరో ఎవరు, విలన్ ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా టోటల్ ట్రయిలర్ ను కట్ చేసిన విధానం బాగుంది. ట్రయిలర్ లో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

ఈనెల 19న థియేటర్లలోకి వస్తోంది బుజ్జి ఇలారా సినిమా. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఇలాంటి ఒక క్రైమ్-థ్రిల్లర్ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అందించడం ఆసక్తికరంగా మారింది.



First Published:  14 Aug 2022 3:40 AM GMT
Next Story