Telugu Global
Cinema & Entertainment

BRO Trailer | ఒకేసారి 2 చోట్లు 2 ఈవెంట్లు

BRO Trailer - మరికొన్ని గంటల్లో బ్రో సినిమా ట్రయిలర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ ను 2 చోట్ల ఏర్పాటుచేశారు.

BRO Trailer | ఒకేసారి 2 చోట్లు 2 ఈవెంట్లు
X

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా టీజర్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. ఇప్పుడు ట్రయిలర్ రిలీజ్ టైమ్ వచ్చింది. మరికొన్ని గంటల్లో బ్రో సినిమా ట్రయిలర్ లాంఛ్ కాబోతోంది. దీని కోసం ఒకేసారి 2 పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేశారు.

ఈరోజు సాయంత్రం ఇటు హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో, అటు వైజాగ్ జగదాంబ థియేటర్ లో 2 భారీ ఫంక్షన్లు ఏర్పాటుచేశారు. దేవి థియేటర్ లో జరగనున్న ఫంక్షన్ కు దర్శకుడు సముద్రఖని, హీరోయిన్ కేతిక శర్మ, మ్యూజిక్ డైరక్టర్ తమన్ హాజరవుతారు. ఇక వైజాగ్ లో జరే ఈవెంట్ కు హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎటెండ్ అవుతారు

ఇలా ఒకేసారి 2 చోట్ల 2 భారీ ఈవెంట్లు చేసి, బ్రో ట్రయిలర్ ను గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్ణయించారు. తమిళ్ లో వచ్చిన వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. తమిళ వెర్షన్ కు పూర్తిస్థాయిలో మార్పుచేర్పులు చేసిన త్రివిక్రమ్, ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.

మూవీలో సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా, మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 28న బ్రో సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  22 July 2023 6:36 AM GMT
Next Story