Telugu Global
Cinema & Entertainment

BRO Movie Trailer | పవన్ సినిమా ట్రయిలర్ వచ్చేస్తోంది

BRO Movie Trailer | పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో (BRO). ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. డేట్ లాక్ అయింది.

BRO Movie Trailer | పవన్ సినిమా ట్రయిలర్ వచ్చేస్తోంది
X

BRO Movie Trailer | పవన్ సినిమా ట్రయిలర్ వచ్చేస్తోంది

BRO Movie Trailer | పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని మరింత పెంచేలా రాబోతోంది ట్రయిలర్. అవును..బ్రో సినిమా ట్రయిలర్ రిలీజ్ కు డేట్ లాక్ అయింది.

ఈ సినిమా ట్రయిలర్ ను ను మరో 3 రోజుల్లో, అంటే 21వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అందరికంటే ముందు నిర్మాత స్పందించాడు. ట్రయిలర్ రిలీజ్ తేదీని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ స్వయంగా వెల్లడించారు.

బ్రో సినిమా టీజర్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రయిలర్ తో ఆ అంచనాల్ని మరింత పెంచబోతున్నారు. మరోవైపు ఉన్నఫలంగా ట్రయిలర్ రిలీజ్ డేట్ వెల్లడించడానికి మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు మరికొంతమంది.

ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం లేదు. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ కాగా, రెండూ ఏవరేజ్ అనిపించుకున్నాయి. దీంతో కాస్త తొందరగా ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

పవన్ ఇందులో దేవుడిగా నటిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీమేక్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్, మాటలు-స్క్రీన్ ప్లే అందించాడు.

First Published:  18 July 2023 12:13 PM GMT
Next Story