Telugu Global
Cinema & Entertainment

BRO Movie | బ్రో మరోసారి వచ్చేస్తున్నాడు

BRO Movie - థియేటర్లలో ఫ్లాప్ అయిన బ్రో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ వారాంతమే సినిమా అలరించబోతోంది.

BRO Movie | బ్రో మరోసారి వచ్చేస్తున్నాడు
X

పవన్ కల్యాణ్,సాయితేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించినప్పటికీ.. తెరవెనక అన్నీ త్రివిక్రమ్ చూసుకున్నాడు. కథలో మార్పుచేర్పులతో పాటు, స్క్రీన్ ప్లే-డైలాగ్స్ కూడా అందించాడు. ఇలా భారీ సెటప్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.

రీసెంట్ గా ఈ సినిమా థియేట్రికల్ రన్ కూడా క్లోజ్ అయింది. క్లోజింగ్ కలెక్షన్లలో భాగంగా ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. నిర్మాతకు, బయ్యర్లకు దాదాపు 40 శాతం నష్టాలు వచ్చినట్టు చెబుతున్నారు.

అలా క్లోజ్ అయిన బ్రో మూవీ, ఇప్పుడు మరోసారి ప్రత్యక్షం కాబోతోంది. ఈసారి ఓటీటీ రిలీజ్ కు సిద్ధమౌతోంది ఈ మూవీ. థియేటర్ల నుంచి తప్పుకున్న ఈ మూవీ ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

తమిళ్ లో వచ్చిన వినోదాయశితం సినిమాకు రీమేక్ గా వచ్చింది బ్రో సినిమా. అయితే ఒరిజినల్ తో పోలిస్తే, ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశారు. ఆ మార్పులే ప్రేక్షకుల తిరస్కరణకు గురయ్యాయి. దీనికితోడు సినిమాపై రాజకీయంగా వివాదాలు కూడా చెలరేగడంతో, ఓ వర్గం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఓటీటీలో ఈ సినిమా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

First Published:  20 Aug 2023 4:06 PM GMT
Next Story