Telugu Global
Cinema & Entertainment

BRO Movie | ఓవర్సీస్ లో పవన్ సినిమాకు తగ్గిన వసూళ్లు

BRO Movie - పవన్ కల్యాణ్, సాయితేేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. యూఎస్ఏ ప్రీమియర్స్ వసూళ్లలో ఈ సినిమా వెనకబడింది. చిరంజీవి, బాలయ్య మూవీస్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది.

BRO Movie | ఓవర్సీస్ లో పవన్ సినిమాకు తగ్గిన వసూళ్లు
X

ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తుందని భావించిన బ్రో సినిమా, మొదటి రోజే చతికిలపడింది. ప్రీమియర్స్ లో ఈ సినిమా రికార్డులు సృష్టించలేకపోయింది. ట్రేడ్ అంచనా ప్రకారం, ప్రీమియర్స్ తోనే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందని భావించారు. కానీ అలా జరగలేదు సరికదా, కనీసం ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా నిలవలేకపోయింది బ్రో సినిమా.

ఈ ఏడాది ప్రీమియర్స్ లో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆదిపురుష్ నిలిస్తే.. రెండో స్థానంలో వీరసింహారెడ్డి, మూడో స్థానంలో వాల్తేరు వీరయ్య నిలిచాయి. పవన్ హీరోగా నటించిన బ్రో సినిమా నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది ఇప్పటివరకు ప్రీమియర్స్ తో అత్యథిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాల లిస్ట్ ఇలా ఉంది..

ఆదిపురుష్ - 11,95,316 డాలర్లు (ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి..)

వీరసింహారెడ్డి - - 7,08,472 డాలర్లు

వాల్తేరు వీరయ్య - 6,79,036 డాలర్లు

బ్రో - 6,47,227 డాలర్లు

దసరా - 6,37,677 డాలర్లు

First Published:  29 July 2023 1:51 AM GMT
Next Story