Telugu Global
Cinema & Entertainment

BRO Movie - ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్న బ్రో

BRO Movie - పవన్ హీరోగా నటిస్తున్న బ్రో మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మరో హీరో సాయితేజ్ ప్రకటించాడు.

BRO Movie - ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్న బ్రో
X

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందని చాలామంది అనుకుంటున్నారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందనే విషయం ఈరోజు బయటపడింది. స్వయంగా సాయితేజ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇది వెల్లడైంది.

బ్రో యూనిట్ ఆస్ట్రియా వెళ్లింది. అక్కడ అందమైన లొకేషన్లలో సాయితేజ్, కేతికశర్మ మధ్య ఓ సాంగ్ తీశారు. ఈ సాంగ్ కు సంబంధించిన స్టిల్స్ ను సాయితేజ్ షేర్ చేశాడు. అంతేకాదు.. ఈ సాంగ్ తో టోటల్ సినిమా షూట్ కంప్లీట్ అయిందనే విషయాన్ని కూడా వెల్లడించాడు.

సాయితేజ్ ప్రకటనతో బ్రో సినిమా షూట్ ఇంకా పెండింగ్ ఉందనే విషయం జనాలకు తెలిసొచ్చింది. ఈ సినిమా కోసం ఆమధ్య హైదరాబాద్ లో ఓ పబ్ సెట్ వేశారు. ఆ సెట్ లో తీసిన సాంగ్ తో టోటల్ షూట్ కంప్లీట్ అనుకున్నారు. కానీ అంతలోనే ఆస్ట్రియా వెళ్లి మరో సాంగ్ పూర్తిచేసింది యూనిట్.

మొత్తానికి సాయితేజ్ స్టేట్ మెంట్ తో బ్రో సినిమా షూటింగ్ అధికారికంగా పూర్తయినట్టయింది. ఇక మరో పెద్ద పని మిగిలి ఉంది. అదే పవన్ కల్యాణ్ డబ్బింగ్. ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. అది పూర్తయితే తప్ప, యూనిట్ కు మనశ్శాంతి లేదు.

First Published:  5 July 2023 5:02 PM GMT
Next Story