Telugu Global
Cinema & Entertainment

Yashoda Movie OTT: యశోద సినిమాకు చిక్కులు.. ఓటీటీలో విడుదలకు బ్రేక్

Yashoda Movie OTT Release Date: ఈ సినిమాలో ఇవా ఐవీఎఫ్‌ను అప్రదిష్ఠ పాలు చేసేలా చిత్రీకరించారని.. ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ విడుదలను ఆపాలని కోర్టు ఆదేశించింది.

Yashoda Movie OTT: యశోద సినిమాకు చిక్కులు..  ఓటీటీలో విడుదలకు బ్రేక్
X

Yashoda Movie OTT: యశోద సినిమాకు చిక్కులు.. ఓటీటీలో విడుదలకు బ్రేక్

ప్రముఖ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రానికి చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమాను డిసెంబర్ 19 వరకు ఓటీటీలో విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యశోద చిత్రం.. సరోగసీ నేపథ్యంలో సాగింది. అయితే ఈ సినిమాలో ఇవా ఐవీఎఫ్‌ను అప్రదిష్ఠ పాలు చేసేలా చిత్రీకరించారని.. ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ విడుదలను ఆపాలని కోర్టు ఆదేశించింది. అంతేకాక చిత్ర నిర్మాతలు, దర్శకులకు కూడా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

కాగా ఇవాళ ఇవా ఐవీఎఫ్ నిర్వాహకులు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంస్థ పేరును యశోద సినిమాలో వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. దీని వల్ల తమ సంస్థకు చెడ్డ పేరు వస్తోందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా తమ సంస్థ‌ పేరు వాడుకున్నారని పేర్కొన్నారు. తమ సంస్థలో ఎటువంటి అనైతిక కార్యకలాపాలు జరగడం లేదన్నారు.

కాగా యశోద సినిమాలో ఇవా ఐవీఎఫ్ సంస్థ పేరు వాడుకోవడంపై ఆ సంస్థ నిర్వాహకులు చేస్తున్న ఆరోపణలపై ఇంతవరకు యశోద సినిమా యూనిట్ స్పందించలేదు. ఇటీవల విడుదలైన యశోద సినిమాకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్ల విషయంలో కొంత వెనకబడ్డప్పటికీ సమంత నటనకు ప్రశంసలు దక్కాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం చిక్కులు వచ్చాయి.

First Published:  24 Nov 2022 10:51 AM GMT
Next Story