Telugu Global
Cinema & Entertainment

Brama Yugam | భ్రమయుగం వచ్చేస్తోంది

Bramayugam - మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. ఈ సినిమా రిలీజ్ కు డేట్ లాక్ అయింది.

Brama Yugam | భ్రమయుగం వచ్చేస్తోంది
X

మలయాళం సినిమాలు ఎంత గ్రిప్పింగ్ గా ఉంటాయో తెలిసిందే. అందులోనూ మమ్ముట్టి లాంటి నటుడు నటించాడంటే ఆ సినిమా ఎంత ప్రత్యేకమో అస్సలు చెప్పనక్కర్లేదు. అందుకే భ్రమయుగం సినిమాపై అన్ని అంచనాలు. ఇప్పటికే ప్రచారంతో కట్టిపడేస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

భ్రమయుగం’ ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. మమ్ముట్టి కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇది.

'భ్రమయుగం’ అనేది మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ఈ బ్యానర్ పెట్టారు. ఇలాంటి బ్యానర్ పై భ్రమయుగం వస్తోందంటే క్వాలిటీ అర్థం చేసుకోవచ్చు.

జనవరి 26 నుంచి ఈ సినిమా ప్రచారం మొదలైంది. అప్పట్నుంచి ఇది దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా విడుదల తేదీ ప్రకటించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మమ్ముట్టి నటనతో పాటు.. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్, క్రిస్టో జేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్స్ అంటున్నారు.

First Published:  28 Jan 2024 3:52 PM GMT
Next Story